Sunday, September 8, 2024

చిట్టీల పేరుతో ఘరానా మోసగాడు*

- Advertisement -

చిట్టీల పేరుతో ఘరానా మోసగాడు*

*శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం* *ఆలస్యంగా వెలుగు చూసిన మరో చిట్టీల మోసగాడు* *మళ్లీ కుంటిభద్ర గ్రామంలో యువకుడే ఈ ఘరానా మోసగాడు* *ఇదంతా దాదాపుగా 16 నెలల క్రితం నుంచి జరుగుతున్నా బైట పడని వైనం* *31 మంది దగ్గర దాదాపుగా కోటి రూపాయలు కు కుచ్చు టోపీ పెట్టిన మాధవుడు* *అడిగితే చంపితే చంపండి అంటున్నాడు* *ప్రస్తుతానికి ఐపీ పెట్టి కోర్టు ద్వారా చూసుకుందాం అంటున్నాడు* *పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలలో రాత్రి,పగలు తేడా లేకుండా కష్ట పడి రూపాయి రూపాయి కూడబెట్టి ఇలాంటి నమ్మించి మోసం చేసిన నయవంచకుడికి ఇచ్చాము అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కల్లంట రక్తం కారుస్తున్న బాధితులు* *కొత్తూరు మండలం కుంటిభద్ర గ్రామం :* పై ఫోటో లో ఉన్న వ్యక్తి పేరు గులివిందల మాధవ రావు s/o బుచ్చిబాబు, కుంటిభద్ర, కొత్తూరు, శ్రీకాకుళం. ఈ మహానుభావుడు సుమారు 50 మంది పొట్టకూటి కోసం వలస వచ్చి హైదరాబాద్, మూసాపేట్ లో కాయకష్టం చేసుకొని బ్రతికే వలస కుటుంబాలను, రూపాయి రూపాయి పోగేసి దాచుకున్న సొమ్మును, అయినవాళ్లు, స్నేహితులను మంచిమాటలతో నయవంచన చేసి చిట్టీల పేరు తో డబ్బు కట్టించుకొని సుమారు ఒక కోటి రూపాయల వరకు ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసి డబ్బు మొత్తం జమ చేసుకొని సొంత ఊరుకి హుడాయించాడు. గులివిందల మాధవ దగ్గరకు మోసపోయిన వారిలో కొందరు తన సొంత ఊరికి వెళ్లి పెద్దల సమక్షములో పంచాయతీ పెట్టినా, నేటికీ ఒక సంవత్సరం 4 మాసాలు పూర్తి అయినా ఎటువంటి ఉపయోగం లేదు. పోలీస్ కేసు, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి లేక కొత్తూరు గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళినా.. ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా న్యాయం జరగలేదు. మాకే కాదు సొంత ఊరు వారికి కూడా సుమారు 20 లక్షల వరకు నామం పెట్టి దర్జాగా ఐపీ పెట్టి తిరుగుతున్నాడు. మా నెత్తుటి కష్టంతో జల్సాలు చేస్తూ మొత్తం కుటుంబం బ్రతుకుతున్నారు, పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాల్సింది పోయి,వాడితో చేతులు కలిపి అతని కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములుగా చేరారు. ఎవరైనా వెళ్లి అడిగితేనాదగ్గర ఏమి లేదు, నన్ను సంపేస్తే సంపేయండని తిరగ బెదిరిస్తున్నాడు. ఐతే మాకు జరిగినట్లే ఇంకెవరూ ఈ నయవంచకుడి చేతిలో మోసపోకూడదని భాదితులు చెప్తున్నారు. చివరిగా ఇన్ని సార్లు తమ చెమట చుక్కలని ధారపోసి రూపాయి రూపాయి కూడబెట్టి ఇలాంటి మోసగాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి మోసపోతున్న పేదవాడికి న్యాయం జరిగేది ఎప్పుడు? మోసపోయిన బాధితుడు రోడ్ల మీద తిరుగుతుంటే.. మోసం చేసిన వాడు వాళ్ల డబ్బులతో జల్సాలు చేస్తుంటే… చట్టం.. న్యాయం.. అనేవి అలా చూస్తూ ఉండటమేనా? ఐనా చిట్టీల నడిపే వారికి ప్రభుత్వ పర్మిషన్ కావాలి.. అవి లేకుండా నడిపిస్తున్న వారు ఎందరో.. కనీసం డబ్బులు కట్టి మోసపోయిన మాలాంటి వాళ్లకు న్యాయం చేయకపోయినా.. అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా చిట్టీల వేస్తున్న వారి పైన ఐనా పోలీసులు, న్యాయ స్థానాలు చర్యలు తీసుకుంటే మళ్ళీ మా లాంటి బాధితులు ఇకపైన ఉండరని వాపోతున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్