ఘరాన దొంగ అరెస్టు

- Advertisement -

ఘరాన దొంగ అరెస్టు

Gharana thief arrested

నరసాపురం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో తాళం వేసి ఉన్న ఇండ్ల లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత అంతర జిల్లా నేరస్తుడు మండెల నాగ భాస్కరరావు ను నరసాపురం పోలీసులు అరెస్ట్ చేసి రూ 1.42 లక్షలు విలువ చేసే 71.47 గ్రా బంగారం ను స్వాదీనం చేసుకున్నారు. నరసాపురం డి ఎస్ పి మురళి కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం డా అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కు చెందిన మండెల నాగ భాస్కరరావు (38) అక్టోబర్ 1 వ తేదీన పట్టణంలోని పిల్లిపేట లో 108 లో నర్సు గా పనిచేస్తున్న ఉమా మహేశ్వరీ డ్యూటీ కి వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగలగొట్టి నగదు దొంగ్లించుకు పోయాడు బాధితురాలు ఫిర్యాదు తో విచారణ చెపట్టిన  పోలీసులు దొంగతనం చేసిన పాత నేరస్తుడు భాస్కరావు ను అరెస్ట్ చేసి రూ 1,42,940 విలువ చేసే 71.47 గ్రా బంగారం ను స్వాదీనం చేసుకున్నాం అన్నారు. నేరస్తుడు పై ఒక్క నరసాపురం పోలీస్ సబ్ డివిజన్ లోనే 15 కేసులు ఉన్నాయని తెలిపారు. ఇతనితో పాటు నేరం చేసిన మరో నేరస్తుడు పరారీ లో ఉన్నాడని త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని డిఎస్పి తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular