- Advertisement -
సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ పనులు పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్
GHMC Commissioner inspected the second level flyover works
హైదరాబాద్
గచ్చిబౌలి నుండి కొండ పూర్ చేపట్టి శిల్ప లె ఔట్ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను జి హెచ్ ఎం సి కమిషనర్ ఇలంబరీది పరిశీలించారు. సర్వీస్ రోడ్డు కు సంభందించిన భూసేకరణ పూర్తి చేయాలని
అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణ లో ప్రభుత్వ పాఠశాల భవనం కొంత మేరకు కొల్పోతున్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సి యస్ ఆర్ పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు
చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసారు.
విద్యార్థులకు రోడ్డు కు ఇరువైపులా దాటి వెల్లె సందర్భంలో ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన లు సిద్దం చేయాలని అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను నిర్దేశించిన కాల
వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచిం,ఆనే.
కమిషనర్ వెంట ప్రాజెక్టు సి ఈ దేవానంద్, శేరికింగం పల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, యస్ ఈ శంకర్ నాయక్, డి సి ముకుందా రెడ్డి r ఈ ఈ హరీష్, నాయకు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు
పాల్గొన్నారు.
- Advertisement -