- Advertisement -
జూబ్లీహిల్స్ అక్టోబర్ 30 (వాయిస్ టుడే): జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో వడ్డెర్లకు అన్ని పార్టీలు మోసం చేశాయని, సోమవారం వడ్డెర సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. నియోజకవర్గంలో 22 వేల ఓట్లు ఉన్నాయని. మా కులాన్ని గత 20 సంవత్సరాలుగా అన్ని పార్టీలు మోసం చేశాయని మాకు కమ్యూనిటీ హాల్, గుడి కట్టించి ఇస్తానని ఇంతవరకు ఏ పార్టీ చేయలేదని, ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ నాయకులు అయితే మా కులానికి న్యాయం చేసి వడ్డెర సంఘానికి కమ్యూనిటీ హాల్, గుడి కట్టించి ఇస్తారు వారికే ఓటు వేస్తామని, లేదంటే మా ఓట్లు ఏ పార్టీకి వేయమని కుల సంఘం తరఫున నిర్ణయించుకున్నామని రాజకీయ నాయకులను హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వేముల యాదయ్య ఇతర కుల పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -



