బిఆర్ఎస్ ను గద్దె దింపి…
ప్రజల కష్టాలను తొలగిస్తా…
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి…
కొండా సురేఖ
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 23 వ డివిజన్లో గడపగడపకు సురేఖమ్మ అనే కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ ప్రజలకు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటి ప్రచారంలో వివరించడానికి మాజీ మంత్రి కొండా సురేఖ గోపాల స్వామి గుడి,పద్మశాలి ఫంక్షన్ హాల్,ఎలగం శ్రీను లైన్,మాస్టర్ హోటల్,80ఫీట్ రోడ్,ఇందిరా గాంధీ విగ్రహం,మార్కండేయటెంపుల్, ముస్లిమ్ వాడ,తుమ్మలగుంట మైసమ్మ గుడి,బాల సంఘం ,ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఏరియా ప్రాంతాలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ
వచ్చె ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అందిస్తూ ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ గెలుపుకు యువత కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ, అమలు చేస్తుందని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అందరూ బలపరచాలని కోరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూరుకుపోయిందని ప్రజలకు ఇచ్చిన యొక్క హామీ నెరవేర్చలేక పోయిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అట్టడుగు వర్గాల నుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని తెలియజేశారు గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏమి అభివృద్ధి జరగలేదని ఈ దోపిడీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ చేయి గుర్తుపై ఓటు వేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ కోరడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కాంటెస్ట్ కార్పోరేటర్లు, మహిళ నాయకులు, కార్యకర్తలు, కొండ అభిమానులు, పాల్గొన్నారు


