స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు :కల్వకుంట్ల కవిత

- Advertisement -

స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
ఎక్స్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్

Giving a clean chit to the Speaker is an ax to democracy: Kalvakuntla Kavitha
పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్  క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు అంటేనే పార్టీ ఫిరాయించినట్టు కదా! ఇంతకు మించిన ఆధారాలు ఇంకేముంటాయి స్పీకర్ గారని నిలదీసారు.
మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాలలో మీరు క్లీన్ చిట్ ఇచ్చిన ఎమ్మెల్యేనే కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ లు ఇవ్వడం ఎంత వివాదాస్పదం అయ్యిందో లోకమంతా చూసింది.. అయినా ఆ విషయం మీ దృష్టికి రాలేదా?
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేసిన స్పీకర్,  మీరు రాజ్యాంగ బద్దమైన స్పీకర్ చైర్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు అనుకోవాలా…? మీరు భారత రాజ్యాంగాన్ని చట్ట సభకు ఔన్నత్యాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular