విజయవాడ:అక్టోబర్ 22: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాటికి 8 వరోజుకు చేరాయి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గా దేవి అలంకారానికి ఎంతో విశిష్టత ఉంది. దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిధి రోజున సంహారించింది. అందుకే దుర్గగా కీర్తించబడుతుంది.
నవరాత్రులలో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమీయడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాడ విశ్వాసం.
లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ ఇంద్రకీలాద్రిపై స్వయంగా అష్టమి తిధినాడు ఆవిర్బవించింది. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. ‘ దుర్గే దుర్గతి నాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది
అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్టించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలికింద దుర్గమాసురుడు మహిషురుణ్ని తొక్కిపట్టి ఉంచుతూ దర్శనమిస్తుంది. ఈరోజు దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
దుర్గాష్టమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు పోయి సద్గతులు ప్రసాదించబడతాయని భక్తుల విశ్వాసం…