కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనానికి నిత్యం వేలాది మంది తరలివస్తుంటారు.
Gol Mall in Tirumala Srivari Darshan tickets
వివిధ రకాల సేవలు, దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో గోల్ మాల్ వ్యవహారం బయటపడింది.
శ్రీవాణి టికెట్లలో కొంతమంది గోల్ మాల్ చేసినట్లు టీటీడీ గుర్తించింది. 545 మంది యూజర్ల ద్వారా.. దాదాపుగా 14,449 అనుమానిత శ్రీవాణి టికెట్ల లావాదేవీలు జరిగినట్లు తనిఖీల్లో టీటీడీ గుర్తించింది. అలాంటి యూజర్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. అలాగే వారికీ మెసేజ్‌లను పంపినట్లు తెలిపింది. ఇదికాకుండా కొంతమంది బుక్ చేసిన 225 శ్రీవాణి టికెట్లపైనా టీటీడీ దృష్టి సారించింది. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చిన సందర్భంలో టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.