దిగొచ్చిన బంగారం ధరలు

- Advertisement -

దిగొచ్చిన బంగారం ధరలు
హైదరాబాద్, మర్చి 2

Gold prices fall
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం అయ్యాయి. రెండు రోజులుగా ధరలు పెరుగుతుండగా.. ఒక్కసారిగా దానికి బ్రేక్ పడింది. సోమవారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. బంగారం ధరలపై సీన్ రివర్స్ అయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడటంతో రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ ఒక్కసారిగా ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం బంగారం ధరలు రూ.3,290 తగ్గాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.1,69,800కి పడిపోయింది. నిన్న ఈ రేటు రూ.1,73,090 వద్ద స్థిరపడింది. ఆదివారంతో పోలిస్తే రూ.3,290క డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ. 1,55,650కి తగ్గిపోయింది. నిన్న రూ.1,58,650కి కుప్పకూలింది. నిన్నటితో పోలిస్తే రూ.3 వేలు తగ్గింది.ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,70,840గా ఉంది. ఆదివారం ఈ ధర రూ.1,72,090గా ఉండేది. నిన్నటితో చూసుకుంటే చెన్నైలో రూ.1250 మాత్రమే తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,56,600గా ప్రస్తుతం కొనసాగుతోంగా.. నిన్న రూ.1,57,750 వద్ద స్థిరపడింది.అటు బెంగళూరులో చూసుకుంటే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,69,800గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,55,650 వద్ద కొనసాగుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,69,950 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,55,800 వద్ద కొనసాగుతోంది.అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బంగారం ధరలు రూ.2 లక్షలకు త్వరలో చేరుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. యద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే స్టాక్ మార్కెట్లు కూప్పకూలే ప్రమాదముంది. దీంతో పసిడి వైపు పెట్టుబడులు పెరగడంతో డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular