Sunday, March 8, 2026

కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ.. ప్రజలకు బొందల తెలంగాణగా మారింది

- Advertisement -

ఇచ్చిన మాట తప్పిన రఘునందన్ రావు ఓటు అడిగే హక్కు లేదు

భూమి లేని పేదలకు కూడా రూ.12000 రైతు బంధు ఇస్తాం

కేసీఆర్ సర్కారును బొంద పెడితే వచ్చేనెల రూ.4 వేలు ఇస్తాం

కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తా

కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తానని హెచ్చరించన రేవంత్ రెడ్డి

సిద్దిపేట నవంబర్ 23: దుబ్బాకకు రావలసిన నిధులు మామ అల్లుళ్లు సిద్దిపేటకు తరలించుకు పోయిండ్రని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై ఆరోపించారు. గురువారం దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ మాట్లాడారు. మూడేండ్లలో రఘునందన్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పిన బీజేపీ ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీజేపీ రాజకీయ కుమ్ములాటల్లో రఘునందన్ మునిగిపోయారని అన్నారు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అని, ప్రజలకు బొందల తెలంగాణగా మారిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను బక్కోన్ని అని అంటున్నాడు కేసీఆర్. బక్కోనికి బుక్కెడు బువ్వ, రెండు పెగ్గుల మందు కావాలి. కానీ 10 వేల ఎకరాలు మింగినవ్. ఆ పక్క హరీశ్ రావు , మరోపక్క కేటీఆర్ ఉండి దుబ్బాకను ఎందుకు బంగారు తునుక చేయలేదు’’ అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500 లేకే గ్యాస్ సిలిండర్, ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు, తులం బంగారం, వ్యవసాయానికే కాదు గృహావసరాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అందజేస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రాదని కేసీఆర్ చెబుతున్నారని… కేసీఆర్ మతిపోయి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదని విరుచుకుపడ్డారు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా రూ.12000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల విద్యకు రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. ఈ నెల కేసీఆర్ ఉంటే 2 వేలే అని.. వచ్చేనెల కేసీఆర్ సర్కారును బొంద పెడితే రూ.4 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని సెటైర్ విసిరారు. కేసీఆర్‌తో పాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండడానికి ఖచ్చితంగా ఇలు కట్టిస్తానన్నారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్