గంజాయి ముటా గుట్టు రట్టు చేసిన గొల్లపల్లి పోలీసులు
నిందితుల వివరాలు వెల్లడించిన డిఎస్పీ రఘు చందర్
జగిత్యాల
గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు పెట్టుకున్నారని జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు.
జగిత్యాల
జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లలో గంజాయి నిర్మూలనకు జగిత్యాల డి ఎస్పీ రఘు చందర్ ఆద్వర్యంలో, ధర్మపురి సీ ఐ రామ్ నరసింహా రెడ్డి , గొల్లపల్లి ఎస్సై చిర్ర సతీష్ సిబ్బందితో ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారని శనివారం పోలీసులు తెలిపారు.జగిత్యాల డిఎస్పీ
తెలిపిన వివరాల ప్రకారం
గత రెండు సంవత్సరాల నుండి నిందితులు మారంపెల్లి లక్ష్మణ్ , దొమ్మటి కార్తీక్ గంజాయి తాగుటకు బానిస అయ్యారని ఖర్చులకు డబ్బులు లేకపోవడంవలన, గంజాయి ఎక్కడైన తక్కువ ధరకు కొని, ఇక్కడకు తీసుకవచ్చి తాగే అంత తాగి మిగిలిన గంజాయి ఎక్కువ ధరకు అమ్మితే పైసలు ఎక్కువ వస్తయని దాని తోటి వారి ఖర్చులు తీర్చుకుంటు, జల్సాలు చేయవచ్చని నిందితులు నిర్ణయించుకున్నారు.
గంజాయి ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోగ వారి స్నేహితుడు పెగడపెల్లి కి చెందినా అజయ్ ఒడిస్సా రాష్ట్రాములో నూకరాజు అనే వ్యక్తి వద్ద గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని, అతని వద్ద గంజాయి తీసుకొని వస్తే మనం వాడుకుని మిగిలింది ఎక్కువ ధరకు అమ్ముకున్దామని అజయ్ చెప్పి, నూకరాజు యొక్క అడ్రస్స్ ఇచ్చారని డిఎస్పీ తెలిపారు., నిందితులు పల్సర్ బైక్ ఒడిస్సా లో నూకరాజును కలువగా, నూకరాజు గంజాయి 13.24 కిలోలు, చరాస్ 40 గ్రాముల అట్టి వాటిని బ్యాగులో వేసుకొని, అక్కడే పడుకొని బైక్ మీద భద్రాచలం, కరీంనగర్ మీదుగా అబ్బాపూర్ కి వస్తుండగా సాయంత్రం చిల్వకోడూర్ టీ జంక్షన్ వద్దకు రాగేనే నిందితులను పట్టుకొని నిందుతుల వద్ద నుండి 13.24 కిలోల గంజాయి, 40 గ్రామ్స్ చరాస్, రెండు సెల్ ఫోన్లు ,ఒక పల్సర్ బైక్ ని స్వాదీనపర్చుకున్నామని వివరించారు.
స్వాదీన పరచుకున్న గంజాయి , చెరాస్ రూ.2.65 లక్షల విలువ వుంటుందని డిఎస్పీ రఘు చందర్
తెలిపారు.
పట్టుపడిన నిందితులు
మారంపెల్లి లక్ష్మణ్, గ్రామం బాలపల్లి, జగిత్యాల రూరల్ మండలం కాగా
2. దొమ్మటి కార్తీక్ అబ్బాపూర్ గ్రామ0 మండలం గొల్లపల్లిలు పట్టుబడ్డారని మిగిలిన ఇద్దరు
3. అజయ్ పెగడపల్లి .
4. నూకరాజు, ఒడిస్సాకు చెందిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.
నిందితులను పట్టుకొని గంజాయి 13.282 కిలోలను సీజ్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన జిల్లా నోడల్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు, ధర్మపురి సి ఐ రాం నరసింహా రెడ్డి ,గొల్లపల్లి ఎస్సై చిర్ర.సతీష్, సిబ్బంది జె.వేణు, హలీం,లక్ష్మణ్, రమేష్, వేణు , సి డి ఆర్ వింగ్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ అభినందించారు.



