ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
ఐదు రోజుల పనిదినాలు పొడిగింపు
అమరావతి జూన్ 27
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సచివాలయ ఉద్యోగులకు ఉన్న ఐదు రోజుల పనిదినాన్ని పొడిగించారు. సచివాలయ ఉద్యోగులతో పాటు హెచ్‌వోడీల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఉంటుంది. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిన సచివాలయ ఉద్యోగుల కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సదుపాయాలు కల్పించారు. రాజధానిలో క్వార్టర్స్‌తో పాటు ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేసిన ఉద్యోగులు.. వీకెండ్‌లో హైదరాబాద్‌కు వచ్చి తమ కుటుంబాలతో గడిపేవారు.అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే దాకా సచివాలయ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. కానీ వాళ్లు అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలో ఏపీ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీంతో ఈ వెసులుబాటును ఎత్తివేయాలని జగన్ అనుకున్నారు. కానీ సచివాలయ ఉద్యోగుల ఒత్తిడితో ఈ వెసులుబాటును కొనసాగించక తప్పలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతిపై ఫోకస్ పెట్టారు. వీలైనంత తొందరగా రాజధానిని పూర్తిచేసే పనిలో పడ్డారు. కాగా, సచివాలయ ఉద్యోగులకు కల్పించిన ఐదు రోజుల పని దినాల వెసులుబాటు తొందరలోనే ముగుస్తుంది. దీంతో ఈ వెసులుబాటును పొడిగిస్తూ తాజాగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- Advertisement -
- Advertisement -