మందుబాబులకు గుడ్ న్యూస్..
Good news for drug addicts..
చాలా మందికి మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా తాగుతూ ఉంటారు. మందు లేనిదే వారికి ముద్ద దిగదు. ఒక చుక్క కడుపులో ఎప్పుడెప్పుడు పడతదా అని వెయిట్ చేస్తా ఉంటారు.
ఇక పండుగ టైమ్‌లో అయితే పక్కా చుక్క, ముక్క ఉండాల్సిందే. అయితే రీసెంట్‌గా ఏపీలో మద్యం షాపులు బంద్ చేసేందుకు ఉద్యోగాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మందు బాబులు బాగా దిగులు చెందారు. కానీ, ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే..
ఈనెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేయాలని AP బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔచ్సార్సింగ్ ఉద్యోగులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మరోసారి ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 7న చేపట్టాల్సిన మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మందుబాబులు ఎగిరిగంతేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే అదే రోజు వినాయక చవితి కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో తీసుకురాబోతున్న ఎక్సైజ్ పాలసీ విధానం వల్ల సూపర్ వైజర్స్, సేల్స్ మెన్ల ఉద్యోగ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరం చేస్తున్నారనే ప్రచారం పై కూటమి సృష్టత ఇవ్వాలని లేదంటే సెప్టెంబర్ 4వ తేదీన నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరించింది.