- Advertisement -
టమాటాకు మద్దతు ధర కల్పించాలి …
Good price should be provided for tomato...– ఏఐకేఎంఎస్ జిల్లా సత్యన్న డిమాండ్.
ఎమ్మిగనూరు. డిసెంబర్ 11
పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి సత్యన్న టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు రాత్రి, పగలు కష్టపడి పంటలు పండించి వాటికి గిట్టుబాటు నష్టపోతున్నారని, వారి నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక దళారుల చేతుల్లో మోసపోతున్నారని, దళారుల నుండి రైతులను రక్షించి వారికి గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -




