హైదరాబాద్: చినుకు పడితే వీధులన్నీ జలమయమయ్యి ఇళ్లలోకి వరద నీరు ప్రవహించే పరిస్థితి నుంచి అంబర్పేటను అద్భుతమైన నాళాల పునరుద్ధరణ చేపట్టి రోడ్లను విస్తరించి అంబర్పేటను చాలా అభివృద్ధి చేశామని ఈ అభివృద్ధిని చూసి ప్రజల నుండి చక్కని ఆదరణ లభిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు.
శుక్రవారం నాడు అంబర్పేట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలుర్ వెంకటేష్ అంబర్పేట్ పటేల్ నగర్ లోని బుజులి మహంకాళి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం నాయకులు కార్యకర్తలు కలిసి పటేల్ నగర్ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. అంబర్పేట్ లో గడిచిన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి మరియు గడపగడపకు అందిన సంక్షేమ పథకాలను మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి తెలియపరుస్తున్నామని అదే సమయంలో మహిళల నుండి చక్కని స్పందన వస్తుందని వారి ఆదరణ చూసి మరోసారి అంబర్పేటలో బిఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆశాభావం వ్యక్తం చేశారు…
