చుక్కలు చూపించిన గూగుల్ మ్యాప్
Google Map showed stars
అనంతపురం
గూగుల్ మ్యాప్స్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఏదైనా అడ్రస్ తెలియకపోతే గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది. అయితే అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. తాజాగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది.
అనంతపురం జిల్లాలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ లారీ డ్రైవర్ కష్టాల్లో పడ్డారు. కర్ణాటక నుంచి తాడిపత్రి పరిధిలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కంటెయినర్ లారీ బయల్దేరింది. దారి తెలియకపోవడంతో డ్రైవర్ ఫరూక్ గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. అది వేరే దారి చూపించడంతో యాడికి మండలం రామన్న గుడిసె వద్దకు చేరుకుని లారీని గోతుల్లో దింపారు. తర్వాత స్థానికులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లారీని జెసిబిల సహాయంతో బయటకు తీశారు.