Monday, May 11, 2026

గోపాల్ రావు పేట, పెర్కకపల్లి ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి

- Advertisement -

గోపాల్ రావు పేట, పెర్కకపల్లి ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలి

Gopal Rao Peta and Perkakapalli should be formed as separate Gram Panchayats

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ ద్వారా విజ్ఞప్తి

జగిత్యాల,
:
జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నివాసిత ప్రాంతాలు
గోపాల్ రావుపేట, పెర్కకపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్ రావు, పెర్కపల్లి నివాసిత
ప్రాంతాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల
ఏర్పాటుకు చర్యలు చేపట్టేందుకు తగు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉందని,
తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో శంకులపల్లి, గోపాల్ రావుపేట, పెర్కపల్లి ఉండగా, జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో శంకులపల్లి విలీనం కాగా, ప్రస్తుతం గోపాల్ రావుపేట, పెర్కపల్లి నివాసిత ప్రాంతాలు తిప్పన్నపేట
గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నుండి నివాసిత ప్రాంతాల మధ్య సుమారు రెండు
కిలోమీటర్ల దూరం ఉండగా, తమ గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు.
గోపాల్ రావుపేట నివాసిత ప్రాంతంలో సుమారు 2000లకుపైగా జనాభా ఉండగా, 700 మంది ఓటర్లు ఉండగా,
అదేవిధంగా పెర్కపల్లిలో కూడా దాదాపు 2000 వరకు జనాభా ఉండగా, సుమారు 600 మందికిపైగా ఓటర్లు ఉన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో రోడ్లు, మురికికాలువు,
పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతూ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయన్నారు.
తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నివాసిత ప్రాంతాలు గోపాల్ రావు, పెర్కపల్లి వాటి మధ్య సుమారు
రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో స్థానికులు గ్రామ పంచాయతీకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండడం తోపాటు అభివృద్ధికి సరిపడా నిధుల కేటాయింపు చేపట్టకపోవడంతో తమ నివాసిత ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని,
ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు ఒక్కటే మార్గమనే భావనలో ప్రజలు ఉన్నారన్నారు.ఇట్టి పరిస్థితులలో తిప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని నివాసిత ప్రాంతాలు గోపాల్ రావుపేట, పెర్కపల్లి
నివాసిత ప్రాంతాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ, తగు చర్యలు తీసుకోగలరని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్