Thursday, December 12, 2024

నీళ్లు, కరెంట్ వచ్చాయి… ఇంకెం కావాలి

- Advertisement -

అదిలాబాద్, నవంబర్ 8, (వాయిస్ టుడే  ): సిర్పూర్ కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ హక్కుల కోసం పోరాడింది బీఆర్ఎస్..బీఆర్ఎస్ ఏం చేసిందో మీ కళ్ల ముందే ఉంది.. బలవంతంగా తెలంగాణలో ఆంధ్రాను కలిపారు.. దాని వల్ల బాగా నష్టపోయాం.. కాంగ్రెస్ ధోకే బాజీ పార్టీ అని ఆయన విమర్శలు గుప్పించారు. పొత్తు పెట్టుకోని 2004 అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదు.. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారన్నారు. నేను ఆమరణ దీక్ష చేస్తే దిగి వచ్చి తప్పదని తెలంగాణ ఇచ్చారు.. తెలంగాణలో అప్పుడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, బతకలేక వలస పోయే వాళ్లు.. పదేళ్లలో ఏంతో మారింది.. ఆదివాసీ గూడెలకు, లంబాడా తండాలకు పరిశ్రుభ్రమైన నీరు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో నీళ్ల బాధ పోయింది.. కరెంట్ బాగు చేసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలో మొత్తం ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదు.. కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది.. ప్రైవేట్ వైద్యుల దోపిడి చేసేది అని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి బాధలు లేకుండా ప్రభుత్వ దావాఖానాల్లో ప్రసవాలు అవుతున్నాయి.. రైతుల భూముల రక్షణ కోసం ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం.. 16 వేల ఎకరాలకు సిర్పూర్ లో గిరిజనులకు పట్టాలిచ్చాం.. గిరిజనేతరులకు పట్టాలు వస్తాయి..

Got water, electricity... what else do you need?
Got water, electricity… what else do you need?

కేంద్రమే దానికి అడ్డం ఉంది.. లెక్కలు కేంద్రానికి పంపించాం.. ఎన్నికల తర్వాత కేంద్రంతో పోరాడి పట్టాలిప్పిస్తాం.. రైతులు సంతోషంగా ఉన్నారు అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.కరెంట్ 24 గంటలు వేస్టుగా ఇస్తున్నారని కేవలం 3 గంటలే చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వాళ్లు ఇవ్వలేదు, ఇచ్చేవాళ్లపై నిందలేస్తున్నారు.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ షాకులతో ప్రాణాలు కోల్పోయేవారు.. బావుల దగ్గరే నిద్రపోయే వారు రైతులు అని ఆయన తెలిపారు. .నేను వ్యవసాయం చేస్తా.. నేను రైతునే.. వాళ్ల బాధలేందో తెలుసు.. భూముల మీద అధికారం మీకే ఇచ్చాం.. భూమిని మార్చే అధికారం సీఎంకే లేదు.. రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో.. ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు.. రైతు బంధు ఎలా వస్తది.. భీమా ఎలా రావాలి.. వడ్లు కొంటే బ్యాంకులకే డబ్బులు పంపిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్