ప్రభుత్వ ఉద్యోగుల కరువు బత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగుల కరువు బత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర సంఘం డైరీ 2025 ఆవిష్కరణ సభ డిమాండ్
హైదరాబాద్ మార్చి 17

Government employees' drought arrears should be released immediately

తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర సంఘం డైరీ 2025 ఆవిష్కరణ సభ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు  ఏ . పద్మాచారి, గౌరవ అతిథిగా పాశం యాదగిరి విచ్చేసి డైరీ ని ఆవిష్కరించారు.  అనంతరం జరిగిన జరిగిన సమావేశంలో సభ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. కరువు బత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వేతన సవరణ సంఘం నివేదికను 1-7-23 అమలు చేయాలని, ఉద్యోగులు మరియు పింఛన్దారులకు రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 315 ను రద్దు చేసి రాష్ట్రపతి ఉత్తర్వులను పునసమీక్షించాలని, సాధారణ బదిలీలను బదిలీ షెడ్యూల్ను విడుదల చేయాలని, ధీర్ఘ కాలంగా ఒక దగ్గర పనిచేస్తున్న ఉద్యోగ బధిలను చేపట్టాలని, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో క్యాడర్ స్ట్రెంత్ ను ప్రకటించి అందుకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే  ఉద్యోగుల ఆరోగ్య ట్రస్ట్ కు ఉద్యోగ సంఘానికి చెందిన ఒక నాయకున్ని చైర్మన్ గా  నియమించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయపన్ను నుండి ఉపశమనం కల్పించాలని, 20 లక్షల వరకు ఆదాయం పనుండి మినహాయింపు కలిగించేలా స్లాబ్ రేటును సవరించాలని, పనిభారం పెరిగినందున ఉద్యోగ నియామకరణం చేపట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను పునరుద్ధరించాలని పరుగు సేవలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా వేతనాలు ఇచ్చే విధానానికి స్వస్తి చెప్పి వారికి ప్రభుత్వం ద్వారానే నేరుగా వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకరణం వెంటనే పూజ చేయాలని వారానికి ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఎం రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి హరీష్ రెడ్డి, అడ్వైజర్ పి పవన్ కుమార్ గౌడ్, సుధన్ రెడ్డి ,సాయి రెడ్డి, పి కృష్ణమూర్తి, డాక్టర్ బి శంకర్ గౌడ్, కృష్ణారావు, సురేందర్, డాక్టర్ షరీఫ్, మధుసూదన్ రెడ్డి, షణ్ముఖ చారి, కుమారస్వామి, విజయకుమార్, మహిళా ప్రతినిధులు జి పద్మ శ్రీ, నిర్మల తో పాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular