వరద బాధితులు ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
Government is all set to help the flood victims-MLA Bolishetti Srinivas
తాడేపల్లిగూడెం,
తాడేపల్లిగూడెం. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు 9వ తేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడ వరద బాధితుల ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాడేపల్లిగూడెం తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఆహార పొట్లాలతోపాటు నిత్యవసర సరుకులు అందించేందుకు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం బిజెపి నేతలు చేస్తున్న సాయంమరువలేమన్నారు. విజయవాడలోని సింగ్ నగర్, ప్రకాష్ నగర్,పాయకాపురం, రాజీవ్ కాలనీ బుడమేరు మునక ప్రాంతాల్లో ఆయన ట్రాక్టర్ పై పర్యటించారు. అనంతరం వరద బాధితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 25 కేజీల బియ్యం ఉల్లిపాయలు బంగాళాదుంపలు నిత్యవసర సరుకులు స్వయంగా ఇంటింటికి తిరిగి వారికి అందజేశారు.