అంగన్వాడీలకు శుభవార్త

- Advertisement -

అంగన్వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Government is good news for Anganwadis

అంగన్వాడీలకు పదవీ విరమణ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. అంగన్వాడీ టీచర్​కు రూ.2 లక్షలు, హెల్పర్​కు రూ.1 లక్ష రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ అందించనున్నట్లు వివరించారు. హైదరాబాద్​లోని రహమత్​నగర్​లో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ బెనిఫిట్స్​కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో జారీ చేయనున్నట్లు ఆమె వివరించారు. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలోని రహమత్​ నగర్​ డివిజన్​ పరిధిలో ఉన్న కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో “అమ్మ మాట-అంగన్వాడీ బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, పిల్లలు అమ్మ ఒడిలో ఎంత సురక్షితంగా ఉంటారో, అంగన్వాడీల్లో కూడా అంతే సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు డిపార్టుమెంట్​ సేవలు అందిస్తున్నాయని అన్నారు. అందుకే అందరు పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చదువుకోవడానికి పంపించాలని సూచించారు. ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఉండేలా సిలబస్​ ప్రకారం పాఠాలు రూపకల్పన చేయించిందని మంత్రి సీతక్క వెల్లడించారు.నా మొక్క-నా భవిష్యత్తు కార్యక్రమం : ప్రస్తుతం పిల్లలకు యూనిఫాం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. భావి తరాలకు మొక్కల విలువ తెలియజేస్తూ “నా మొక్క-నా భవిష్యత్తు” అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, మొక్కను అంగన్వాడీ కేంద్రంలో నాటడం జరిగిందని అన్నారు. తర్వాత పిల్లలతో, తల్లులతో ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకాటి కరుణ, ఉమెన్​ అండ్​ ఛైల్డ్​ వెల్ఫేర్​ సెక్రటరీ కాంతి వెస్లీ, ఈశాఖ డైరెక్టర్​ అక్కేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, పిల్లలు పాల్గొన్నారు.
“అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు శుభవార్త. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, సహాయకుడికి రూ.1లక్ష చొప్పున రిటైర్మెంట్​ బెనిఫిట్స్​ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అమ్మ మాట-అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీవో విడుదల చేస్తాం. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.” – సీతక్క, మంత్రి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular