Wednesday, April 29, 2026

అన్నదాత పట్ల ప్రభుత్వంది వంచన

- Advertisement -

అన్నదాత పట్ల ప్రభుత్వంది వంచన

Government is hypocritical towards Farmers

హైదరాబాద్
మాజీ మంత్రి ,ఎమ్మెల్యే టి .హరీష్ రావు , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
హరీష్ రావు మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్ బాధతో ,దుఃఖం తో పెట్టాల్సి వస్తోంది. అన్నదాత పట్ల ప్రభుత్వంది వంచన.  తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలన రైతుల పట్ల యమపాశంగా మారింది. మేడ్చల్ లో వ్యవసాయ శాఖ

కార్యాలయం ముందు లేఖ రాసి మరీ సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సురేందర్ రెడ్డి కి గ్రామీణ బ్యాంక్ లో అప్పు ఉంది.
..సురేందర్ రెడ్డి అమ్మకు లక్షా 15 వేలు ,సురేందర్ రెడ్డి కి లక్షా 92 వేలు అప్పు ఉంది. బ్యాంకు మేనేజర్ అనిరుద్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికే రుణమాఫీ అవుతుందని చెప్పడం తో సురేందర్ రెడ్డి ఆత్మహత్య

చేసుకున్నారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖ లోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి ని నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. రేవంత్ రెడ్డి పూటకో మాట పొద్దు తిరుగుడు కంటే వేగంగా మారుతోంది. రేషన్ కార్డు లింకు లేదని

అసెంబ్లీ సాక్షిగా చెప్పావ్. సురేందర్ రెడ్డి ఆత్మహత్య రేషన్ కార్డుకు రైతు రుణ మాఫీకి ఉన్న లింక్ ఉన్నదని నిరూపితం అయ్యిందని అన్నారు.
రేవంత్ పాలనకు సురేందర్ రెడ్డి లేఖ ఓ పంచనామా లాంటిది. రైతు రుణమాఫీ ఆంక్షలతో రేవంత్ కుటుంబ బంధాల్లో చిచ్చు పెట్టారు. కేసీఆర్ కుటుంబ బంధాలు బలోపేతం చేస్తే వాటిని విచ్చిన్నం చేసిన దరిద్రపు గొట్టు

ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం . నా నియోజకవర్గం లో జక్కాపూర్ గ్రామం లో గురజాల బాల్ రెడ్డి కుటుంబం లో ముగ్గురికి రుణం ఉంది. వారికి ఆరు లక్షల అప్పు ఉంటె కేవలం రెండు లక్షలే మాఫీ అవుతోంది. ఇలాంటి

ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇది రైతుల పాలిట రేవంత్ చేసిన మోసం ,దగా కాదా ? .రైతు రుణ మాఫీ ఎగ్గొట్టడానికి రేవంత్ ప్రభుత్వం 31 సాకులు చూపెడుతోంది.  నారాయణ్ పేట గ్రామం లో నల్ల మణెమ్మ అనే

రైతుకు లక్ష రూపాయల అప్పు ఉంది. ఆమె భర్త 2010 లో మరణించారు ..ఆయన ఆధార్ కార్డు తెస్తేనే రుణ మాఫీ చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 2010 లో ఆధార్ కార్డు యే ఇవ్వనప్పుడు ఆధార్

కార్డు ఎలా తెస్తారు ? .కుంభాల సిద్ధారెడ్డి ,చాట్ల హరీష్ అనే రైతులకు భార్యల ఆధార్ కార్డులు తెమ్మంటున్నారు ..వారికి పెళ్లిళ్లే లేవు ..ఆధార్ కార్డులు ఎక్కడ్నుంచి తెస్తారని అన్నారు. ఇలాంటి వాళ్ళు ఎంత మందో

ఉన్నారు ..రుణ మాఫీ కోసం వాళ్ళు పెళ్లిళ్లుచేసుకోవాలా ? 20 లక్షల మందికే ఇప్పటిదాకా రుణ మాఫి అయ్యింది …21 లక్షల రైతుల మంది కి ఇంకా కావాలని అన్నారు.
రుణ మాఫీ అయ్యింది నన్ను బావిలో దూకమని రేవంత్ అంటున్నారు ..ఇపుడు ఎవరు బావిలో దూకారు. కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ ..ఇది కటింగ్ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటే కోతలు అన్నట్టుగా తయారైంది.

ఎన్నికలపుడు కట్టు కథలు చెప్పారు. చేతి గుర్తుకు ఓటేస్తే కోతలే మిగిలాయి. సురేందర్ రెడ్డిని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఆత్మహత్య కాదు ..ప్రభుత్వం చేసిన ఆత్మహత్య అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్