ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్
వాయిస్ టుడే ప్రతినిధి రాజన్న సిరిసిల్ల నవంబర్ 24: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుంటపెళ్లి చెరువు తండాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామానికి చెందిన పర్శ హాన్మాండ్లు పై కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షులు బానోత్ రాజు నాయక్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు..ముదిరాజ్ సామాజిక వర్గం కు చెందిన పర్శ హన్మండ్లు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధుల్లో ఉంటూనే అధికార బిఆర్ఎస్ పార్టీ కి మద్దతుగా ఎన్నికల కోడ్ యదేచ్చగా ఉల్లంఘిస్తూ ముదిరాజ్ కులదైవమైన పెద్దమ్మ గుడి ల వద్ద ముదిరాజ్ లను పిలిచి ఒక వైపు వారి కుల సంఘం బ్యానర్ ను అధికార బి ఆర్ ఎస్ పార్టీ గుర్తు కండువా వేసుకుని బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మాత్రమే ఓటు వేస్తామని వేరే పార్టీకి వెయబోమని ఎన్నికల నియమావళి ఉల్లంగిస్తున్నడని ఎన్నికల అధికారికి ,డీఈఓకు పిర్యాదు చేశామన్నారు.



