Sunday, September 8, 2024

సమస్యల వలయంలో సర్కారు బడులు… చర్యలు తీసుకొని జిల్లా విద్యాధికారులు..

- Advertisement -
Government schools in the circle of problems...The district education officials have taken action.
Government schools in the circle of problems…
The district education officials have taken action.

రంగారెడ్డి అక్టోబర్ 30 వాయిస్ టుడే ప్రతినిధి :

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సమస్యలతో సతమతమవుతూ సిలబస్ పూర్తి అయిన తర్వాత కూడా ఆరు నెలల తర్వాత పుస్తకాల పంపిణీ విద్యార్థులకు చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనుకోకుండా పరీక్షలు రావడంతో విద్యార్థుల సమస్యలు వర్ణనాతీతం. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇన్ని సమస్యలు నెలకొన్న సంబంధిత జిల్లా విద్యాధికారి. మండల విద్యాధికారి నేటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన గురవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి చదవకూడదని వీళ్ళే చెప్పి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలను చేర్పించామని. అయినా కూడా పుస్తకాల పంపిణీ పిల్లల స్కూల్ డ్రెస్సులు నేటి వరకు అంతంత మాత్రమే అందడంతో విద్యార్థుల పరిస్థితి రెంటికి చెడున రేవడిలా తయారయింది. సమస్యలతో తల్లడిల్లుతున్న స్థానిక ఎమ్మెల్యే.కార్పొరేటర్లు పర్యవేక్షణ లోపమే కారణమైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆశతో మా కొడుకులు ఇంకా పెద్ద చదువులు చదివితే కాస్త ఉద్యోగం వస్తుందని ఆశతో ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే అక్కడ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని లబోదిపోమంటున్నారు. పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకొని విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగేలా చూసుకోవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్