Govt should take appropriate steps…
లైంగిక దాడిని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఛీఫ్ డాక్టర్ శిల్పారెడ్డి ఖండించారు. సోమవారం బోడుప్పల్లో ఒక ప్రైవేటు అంతర్జాతీయ పాఠశాలలో డాన్స్ టీచర్ గా పని చేస్తున్న వ్యక్తి ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక దాడిని చేసింది ఈరోజు బిజెపి రాష్ట్రానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి పాఠశాలలో పర్యటించి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల రక్షణకై ఉండాల్సిన సిసి కెమెరాలు సెక్యూరిటీ గాని ఉండకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఆడపిల్లల విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాఠశాల యాజమాన్యం తీసుకోకపోవడంతో నే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని…
ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ల ద్వారా సమీక్షించాలని డిమాండ్ చేశారు.. ఇదివరకే గత ప్రభుత్వంలో బంజారాహిల్స్ లో ఇలాంటి సంఘటన జరిగిందని.. ఇకపై జరగకుండా ఈ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి బాధ్యున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.