అదానీ అక్రమాలపై ప్రభుత్వాలు విచారణ చేపట్టాలి…సిపిఐ
Govts should investigate Adani's irregularities...CPIతుగ్గలిలో నిరసనను చేపట్టిన సిపిఐ నాయకులు.
తుగ్గలి
విద్యుత్ కొనుగోలులో పారిశ్రామికవేత్త ఆదాని అక్రమాలపై ప్రభుత్వాలు విచారణ చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం రోజున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందంలో నాటి సీఎం జగన్ కు 1750 కోట్లు ముడుపులు ఇచ్చినట్లు అమెరికాలో కేసు నమోదు చేయడంతో,ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ గత సీఎం పేరు ఉండడం ఈ ముడుపులపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు నిరసన చేపడుతూ మరోవైపు పార్లమెంటులో జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టి అదానిని అరెస్ట్ చేయాలని దేశమంతా ముక్త కంఠంతో ఆందోళన చేపడుతున్న నరేంద్ర మోడీ నిమ్మకు నేరెత్తినట్లు వ్యహరిస్తున్నారని,మరోవైపు ఈ రాష్ట్రంలో జగన్ చంద్రబాబు ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటూ అదానీపై వచ్చిన ఆరోపణల గురించి చంద్రబాబు నోరు మెదపడం లేదని దీనికి సంబంధించి వెంటనే విచారణ చేసి ఆదాని కుంభకోణాలను బహిర్గతం చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.ఈ రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలు పెంచనని అవసరమనుకుంటే ఇంకా తగ్గిస్తానని ఎన్నికల సందర్భంగా పదేపదే చంద్రబాబు మాట్లాడని,మరి రాష్ట్రంలో మరోసారి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెంచనంత పెద్ద ఎత్తున కరెంటు చార్జీలు పెంచబోతున్నాడని వాటీని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ సామాన్యుడు కొనలేనంత పైకి ఎగబాకుతున్నాయని వాటిని వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం సిపిఐ నాయకులు సీనియర్ అసిస్టెంట్ రాముడు కు వినతి పత్రాన్ని అందజేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నబి రసూల్,సిపిఐ మండల కార్యదర్శి ఎస్. సుల్తాన్,శాఖా కార్యదర్శులు వీరయ్య, సూరారెడ్డి,బాబా ఫక్రుద్దీన్,నాగేష్, సీనియర్ నాయకులు నరసింహులు, జయరాముడు,మాబు పీర తదితరులు పాల్గొన్నారు.




