తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేయాలి…..
Grain should be bought as soon as the moisture level is reached.అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
పొరుగు రాష్ట్రం ధాన్యం మన రాష్ట్రంలోకి రాకుండా చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టంగా విధుల నిర్వహణ
మధిరలో విస్తృతంగా పర్యటించిన అదనపు కలెక్టర్
ఖమ్మం :
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి తరలించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మధిర ప్రాంత పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
మధిరలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, సీసీఐ ద్వారా దెందుకూరు లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం, మధిర మండలం సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ , ఎర్రుపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, తేమ శాతం రాగానే కాంటా వేసి కొనుగోలు చేయాలని అన్నారు. నాణ్యమైన ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రానున్న మూడు వారాలలో ధాన్యం ఎక్కువ పరిమాణంలో రానున్నట్లు వ్యవసాయ శాఖ నుంచి సమాచారం అందుతుందని, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటూ ధాన్యం కొనుగోలు సకాలంలో పూర్తి అయ్యే విధంగా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
రైతులు జిన్నింగ్ మిల్ వద్ద ఎదురుచూసే అవకాశం రానివ్వకుండా సాయంత్రం 6 గంటల లోపు వచ్చిన నాణ్యమైన పత్తిని ఆ రోజే కొనుగోలు చేయాలని పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, రైతులందరూ పత్తి తేమ శాతం 8 నుంచి 12 లోపు ఉండే విధంగా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని అదనపు కలెక్టర్ కోరారు.
మన పొరుగు రాష్ట్రాలలో సన్న రకం ధాన్యానికి బోనస్ లేనందున మన రాష్ట్రంలో వచ్చి అమ్మే ప్రయత్నం చేస్తారని, రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంట మధిర మండల తహసీల్దార్ ఆర్. రాంబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




