Wednesday, May 20, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామసభలు అట్టర్ ప్లాప్..

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలనలో గ్రామసభలు అట్టర్ ప్లాప్..

Gram sabhas are utter flop under Congress rule in Telangana..

 పోలీసు పహారాతో గ్రామాలను నింపేసి గ్రామసభలా!!
ప్రశ్నించిన లబ్ధిదారులపై మీ కాంగ్రెస్ నాయకుల జులూమ్ ఏంటి?
స్థానిక సంస్థల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ గ్రామసభల డ్రామా
భాజాపా మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్
మేడ్చల్ జనవరి 25
నాలుగు కొత్త పథకాలకు లబ్దిదారుల ఎంపికపై తెలంగాణలో నిర్వహిస్తున్న గ్రామసభలలో  కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో క్లియర్ గా వ్యక్తమయిందని  భాజాపా మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ అన్నారు.. గ్రామసభలు   ఉద్రిక్తంగా మరదమీ కాకుండా , అధికారులను,నేతలను,ఎక్కడి కక్కడే గ్రామస్థులు నిలదీసారన్నారు. గ్రామసభలు జరిగిన తీరు సూస్తే  ఇది ముమ్మాటికీ ప్రజావ్యతిరేక పాలననే అనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తుల ప్రభుత్వంగా మారింది ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి దరఖాస్తులు తీసుకోవడంతోటే కాలం వెళ్లబుచ్చుతుంది ఇన్ని దరఖాస్తులు తీసుకొని కేవలం అర్హులను మాత్రమే గుర్తిస్తున్నారు, ఇంకా లబ్ధిదారులను ఎప్పుడు ఫైనల్ చేస్తారో ఏ అధికారి చెప్పటం లేదన్నారు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు..! ఇది భస్మాసుర హస్తంగా మారిందణి గాలి సంపత్ యాదవ్ విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, కానీ! గ్రామ సభల పేరుతో ప్రజలను మరొకసారి వంచించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసమే గ్రామ సభల డ్రామా ఆడుతున్నారణి దుయ్యబట్టారు. ములుగు బుట్టాయిగూడెంలొ జరిగిన గ్రామసభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుమ్మరి నాగేశ్వరరావు బడుగు వర్గాలకు చెందిన దళితుడు ఆయన నా చావుతోనైనా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని ప్రాణత్యాగం చేయబోయాడు,ఇకనైనా రాష్ట్రప్రభుత్వం కళ్లుతెరిచి నిజమైన అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.లేనిచో  భాజాపా ఆధ్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని గాలి సంపత్ యాదవ్ హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్