Sunday, September 8, 2024

 గ్రామ సారథులు-మన గ్రామ వాలంటీర్లు…

- Advertisement -

 గ్రామ సారథులు-మన గ్రామ వాలంటీర్లు…
ఎమ్మెల్యే శ్రీదేవి

తుగ్గలి
గ్రామంలో ప్రజలకూ సేవలందిస్తూ,ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న గ్రామ వాలంటీర్లు గ్రామ సారథులని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి చేశారు. శనివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన వాలంటీర్ల అభినందన సభకు ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వాలంటీర్ల అభినందన సభలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ఆమె తెలియజేశారు. సమాజంలో గల సేవలలో వాలంటీర్ల సేవలు కూడా చాలా గొప్పవని ఆమె తెలియజేసారు.ఈ సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల కొరకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన సేవ వజ్ర,సేవ రత్న,సేవ మిత్ర పురస్కారాలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాలంటీర్లను సన్మానించి ప్రశంస పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శిలు రాజు నాయక్, గోపాల్,అంకాలప్ప,శివ,కార్తిక్,రామాంజనేయులు,విఆర్ఓ రహిమాన్,జడ్పిటిసి పులికొండ నాయక్,వైస్ ఎంపీపీ లు మల్లికార్జున రెడ్డి,ఎర్ర నాగప్ప,ఎంపిటిసి రాజు,మండల కన్వీనర్ జిట్టా నాగేష్,మండల సచివాలయాల కన్వీనర్ హనుమంతు,తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి,రాతన ఉమన్న,రాతన మోహన్ రెడ్డి,వక్ఫ్ బోర్డు డైరెక్టర్ హుస్సేన్,కో ఆప్షన్ మెంబర్ చాంద్ బాషా, ఎర్రగుడి రామచంద్రా రెడ్డి, నాగభూషణం రెడ్డి, బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి,ముక్కెళ్ల గోవర్ధన్ రెడ్డి,మారెళ్ళ సుధాకర్ రెడ్డి,విద్యా కమిటీ చైర్మన్ రఘు,సచివాలయాల మండల కన్వీనర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్