మంథనిలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
Grand Ekadashi celebrations in Manthani
-నారాయణుడి నామఃస్మరణలతో మార్మోగిన ఆలయాలు
మంథని
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీలక్ష్మినారాయణస్వామి, శ్రీమంత్రకూట గోపి జన వల్లభ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం
తెల్లవారుజాము నుండే భక్తులతో నిండిపోయింది. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి స్వరూపుడైన శ్రీలక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర
బారులు తీరారు. ఆలయ అర్చకుడు ప్రసాదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ రోజున మహా విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల
ఆచంచలమైన నమ్మకం. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని భక్తుల సహాయంతో సర్వంగ సుందరంగా పూలతో అలంకరించారు. దీంతో భక్తులు ఆలయంలో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా
సురేష్ రెడ్డి తో, పుర ప్రముఖులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మంథని మండలం కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
సైతం వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆలయ అర్చకులు ముఖేష్ శర్మ పూజలు
నిర్వహించగా ఆలయ ఇన్చార్జ్ ముస్కుల జగ్గారెడ్డి, వీరేశం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.