Sunday, September 8, 2024

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు

- Advertisement -

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు

కరీంనగర్,

సంక్రాంతి పండుగ రైతుల శ్రేయస్సు సూచిస్తుందని, సకల సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.  బుధవారం కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్ట్స్, మంకమ్మతోటలోని అల్ఫోర్స్ ప్లానెట్ కిడ్స్లో, రేకుర్తిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్సైలో అట్టహాసంగా పల్లె వాతావరణం ఉట్టిపడేవిధంగా ఏర్పాటుచేసినటువంటి “అల్ఫోర్స్ మకరసంక్రాంతి సంబరాలకు, ముగ్గుల పోటీల నిర్వహణకు” ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గౌరీ మాత విగ్రహానికి పూల మాల వేసి జ్యోతి ప్రజులన చేసి ఆయన వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ద్వారా సాంప్రదాయాల పరిరక్షణ సందేశాన్ని అందజేయచ్చునని, పండుగల విశిష్టతను వ్యాపింపచేసిన వారమవుతామని తెలుపుతూ సంక్రాంతి పల్లెల్లో చాలా గొప్పగా భేదభావాలను పక్కనపెట్టి ప్రేమ ఆప్యాయతలను పంచుకుంటూ, వాయనాలు ఇచ్చుకుంటు. మధురానుభూతిని ఆశ్వాదిస్తారని చెప్పారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పండుగల యొక్క ప్రాచూర్యం మరింత పెంచవలసిన అవసరం ఉన్నదని తద్వారా పండుగల యొక్క వైభవాన్ని తెలిపిన వారమవుతామని చెప్పారు. విద్యార్థులకు విద్యతో పాటు సాసంస్కృతిక మరియు వివిధ పండుగలను తెలుపబడే కార్యక్రమాలను విశేషంగా చేపడుతున్నామని తెలుపుతూ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేషంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపటుతున్నామని చెప్పారు.

అందులో భాగంగానే నేడు పాఠశాలలో వివిధ రంగుల దుస్తుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినదని వారు చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి సంక్రాంతి తెచ్చింది సంబరం, ఊరంత కదిలిందే మనపండుగకు నృత్యాలు చాలా ఆకర్శించాయి. ప్రత్యకంగా విద్యార్థులు చేపట్టిన సంక్రాంతి సంతోషాన్ని తెచ్చింది అనే నాటకాన్ని ఆలోచింపచేసింది.
అదేవిధంగా సంక్రాంతికి చిహ్నంగా నిలిచే ముగ్గుల పోటీలను చాలా ఆకర్షనీయంగా నిర్వహించారు. సృజనాత్మకంగా ముగులు వేసిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. సుమారు 100 మంది మహిళలు వారి సృజనాత్మకతను ముగ్గుల రూపంలో ప్రదర్శించి పండుగ వైభవాన్ని ముగ్గు విశిష్టతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు వివిధ రంగురంగుల, సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పండుగల వాతావర్ణాన్ని రెట్టింపుచేసారు. పల్లె వాతావర్ణం కన్నులకు కట్టేవిధంగా ఏర్పాటు చేసినటువంటి పొలం, పిండి వంటల తయారీ, నారు వేయడం, గంగిరెద్దుల ఆటలు మరియు బనవన్న చేష్టలు అబ్బురపరిచాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్