- Advertisement -
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Grand Savitribai Phule Jayanti celebrations
మంథని
తొలి మహిళ ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల ప్రవీణ్, అజీమ్ ఖాన్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తొలి ఉపాధ్యాయురాలుగా అనేక మహిళ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడం జరిగిందన్నారు.
సమాజంలోని కులతత్వం పై అలుపెరగని పోరాటం చేసి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి, నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాటం చేసి, పీడిత ప్రజలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంథని రాకేష్, శ్రీపతి బాణయ్య, వేల్పుల రాజు, కుర్ర లింగయ్య, వీకే రవి, దొరగొర్ల శ్రీనివాస్, పర్శవేన మోహన్, లైసెట్టి రాజు, ఆర్ల నారాయణ, ఎరుకల రమేష్, గొల్లపెల్లి శ్రీనివాస్, ఎరుకల సురేష్, మంథని శ్రీనివాస్, జనగామ సడవలి, పోరండ్ల రంజిత్, బూడిద రంజిత్, బూడిద రమేష్, రొడ్డ రాజేశ్వరరావు, నరెడ్ల కిరణ్, పులి రామకృష్ణ, రేపాక శ్రీనివాస్, ఆర్ల జ్ఞాని, మంథని ప్రదీప్, కొయ్యల వినయ్, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -