గడువులోగా కేబుల్ చానల్స్  జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇవ్వండి

- Advertisement -

గడువులోగా కేబుల్ చానల్స్  జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇవ్వండి

Grant accreditations to cable channel journalists within the deadline.

ఐ అండ్ పి ఆర్ కమీషనర్ ముకుంద రెడ్డిని కోరిన జర్నలిస్టు సంఘాల నేతలు

హైదరాబాద్
జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ పోరాటం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ చానెల్స్ జర్నలిస్టులకు ఐఅండ్ పీఆర్ తో పాటు జిల్లాల్లో అక్రెడిటేషన్స్ ఇచ్చేందుకు మెమో నం:321ను జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన నూతన ఆదేశాల మేరకు మే 31 లోపు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరు కేబుల్ చానెల్స్ జర్నలిస్టులకు నూతన అక్రెడిటేషన్స్ ను ఇవ్వాలని మంగళవారం నాడు సమాచార పౌర సంబంధాల శాఖా కమీషనర్ జి.ముకుంద రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి కోరడం జరిగింది. అర్హులైన కేబుల్ చానెల్స్ ను లిస్ట్ ఔట్ చేస్తున్నామని, మే 31 లోపు కేబుల్ చానెల్స్ జర్నలిస్టులకు అక్రెడి టేషన్స్ ఇచ్చేందుకు కృషి చేస్తామని కమీషనర్ ముకుంద రెడ్డి తెలిపారు. ఐ అండ్ పి ఆర్ కమీషనర్ ను కలిసిన వారిలో తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, వి5 న్యూస్ ఛానెల్ సీఈఓ కడకంచి వెంకటేష్, టీఎన్ ఎన్ సీఈఓ దేవేందర్, స్టూడియో 18 భరత్ కుమార్, ఎబి న్యూస్ సీఈఓ బ్రహ్మచారి పలువురు కేబుల్ చానెల్స్ జర్నలిస్టులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular