తక్కువ ప్రీమియంతో ఎక్కువ వ్యక్తిగత భరోసా…ఏపీజీబీ మేనేజర్ శ్రీలత
Greater personal assurance with lower premium...APGB Manager Sreelatha
కేవలం 20 రూపాయలతో రెండు లక్షల ప్రమాద బీమా.
తుగ్గలి:
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) పథకం ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ వ్యక్తిగత ఆర్థిక భరోసా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని తుగ్గలి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్రీలత తెలియజేశారు.గురువారం రోజున ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ప్రభుత్వ మద్దతుతో రూపొందించిన ప్రమాద బీమా పథకం అని ఆమె తెలియజేశారు.తక్కువ ప్రీమియంతో వ్యక్తిగత ప్రమాద బీమా వస్తుందని ఆమె తెలియజేశారు.ఈ పథకం నందు సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే పాలసీ చేసిన వ్యక్తి మరణిస్తే రెండు లక్షల రూపాయలు,అంగవైకల్యానికి గురి అయితే ప్రమాద స్థాయిని బట్టి ప్రమాద బీమాను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆమె తెలియజేశారు.పాము కాటు వలన,కరెంట్ షాక్ వలన మరియు పిడుగుపాటు వలన మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని ఆమె తెలియజేశారు.మండల పరిధిలోని రామలింగాయపల్లి గ్రామానికి చెందిన కామాక్షి వైఫ్ ఆఫ్ ఉల్లిగెత్తి సుంకన్న అనే మహిళ ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు మరణించింది.ఆమె ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి 20 రూపాయలు బ్యాంకులో చెల్లించింది.ఆమె మరణానంతరం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. అనంతరం ఏపీజీబీ మేనేజర్ శ్రీలత కామాక్షి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు లక్షల రూపాయల చెక్కును బుధవారం రోజున అందజేశారు.కావున 18 నుండి 70 సంవత్సరాలు లోపు గల వారందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ శ్రీలత తెలియజేశారు.