కేసులపై స్పష్టత వచ్చాకే గ్రూప్-1 ఫలితాలు ..!

- Advertisement -

గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టులో విచారణ

Group-1 results only after the cases are clarified..!
Group-1 results only after the cases are clarified..!

హైదరాబాద్:ఆగస్టు 02: తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది.

ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇంకా రిజల్ట్స్ తేదీని నిర్ణయించలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. గురువారం ఏజీ వాదనలు వినిపిస్తారని చెప్పడంతో విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీని విడుదల చేశారు. మంగళవారం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఫైనల్ కీని అందుబాటులో ఉంచారు. హైకోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular