- Advertisement -
ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చెయ్యాలి
Guarantee of free sand should be implemented immediatelyపరవాడ
పరవాడ మండలంలో జెఎన్ ఫార్మసిటీ వద్ద శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత ఇసుక హామీ తక్షణమే అమలు చేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు. అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చి, అవినీతిని అరికట్టి, భవన నిర్మాణ కార్మికులకుఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని గని శెట్టి ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం కాలంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగి విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పట్టకుండా కనీసం భవన నిర్మాణాలు చేస్తున్న ప్రజలకు గాని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు గాని ప్రయోజనం లేకుండా చేయడంతో ఆ ప్రభుత్వంపై ఆగ్రహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఓటమి ఎన్నికల్లో ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చింది ఈ హామీ నేడు అమలు చేయకపోవడం విచారకరమన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తికావస్తుందని ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని గని శెట్టి విమర్శించారు. ఇసుక లభించడం లేదని, రవాణా చార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించడం లేదని అన్నారు. కొన్నిచోట్ల అధిక ధరలతో విశాఖ కొనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఇసుకపై పెత్తనం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఉండటం లేదని, ఇసుక విడుదల చేయడానికి ఇల్లు నిర్మాణాలకి ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలతో ఇసుక అమ్మకాలు సాగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పోలమరశెట్టి వీరి నాయుడు, దుర్గారావు, మణి, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




