చత్తీస్ ఘడ్ లో మరోసారి తుపాకుల మోత

- Advertisement -

చత్తీస్ ఘడ్ లో మరోసారి తుపాకుల మోత

 

రాయ్‌పూర్‌:ఫిబ్రవరి 27
ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమ య్యారు..

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాల కు, మావోయిస్టులకు మధ్య ఈరోజు ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకు న్నాయి..

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారస పడినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో కాల్పులు చోటుచేసు కున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమై నట్లు వెల్లడించారు.

కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగు తోందన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular