Tuesday, May 19, 2026

గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి

Gurukuls should be utilized

-మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా
మంథని
గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సభలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న గురుకులాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి గురుకులాల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరని కోరారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాలలో   5వ తరగతి ప్రవేశ పరీక్షకు, ఎస్సీ,  ఎస్టీ గురుకులాల్లో 6 నుండి 9 తరగతిలో ఖాళీల కొరకు ప్రవేశానికి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గౌలిదొడ్డి,  అలుగునూరు సిఓఈలో 9వ తరగతి ప్రవేశానికి, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఖమ్మం,  పరిగి ఎస్ఓఈలో ఎనిమిదో తరగతి ప్రవేశానికి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్ స్కూల్ లో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు.  విద్యార్థులు ఫిబ్రవరి 01 లోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థి కులం సర్టిఫికెట్ నెంబర్, ఆదాయం సర్టిఫికెట్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, ఫోటో లతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన ఉంటుందని గుర్తు చేశారు. గురుకులాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఆమె వివరించారు. విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచడం వల్ల పౌష్టికమైన ఆహారం అందుతున్నట్లు ఆమె తెలిపారు. అర్హత గల విద్యార్థులు గురుకులాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె ఆశించారు. ఈ కార్యక్రమంలో మంథని డిప్యూటీ తాసిల్దార్ గిరి, ఏడిఏ అంజని మిశ్రా, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ వికే రవి, మంథని సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్