ప్రాజెక్టులు పూర్తి కాలేదు: ప్రియాంక
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విజయభేరి భారీ బహిరంగ సభ లో ప్రసంగించారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎం మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు, గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడడా, 10 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడా అని ప్రశ్నించారు. వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ, ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది, రైతుల రుణమాఫీ చెయ్యలేదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ చేసింది. ఆదాని కి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడని అన్నారు.
రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే, అదాని మాత్రం 16 వందల కోట్లు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తో మీ ముందుకు వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50, 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8,9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది. ఓవైసీ ఎప్పుడు రాహుల్ గాంధీ ని నిందిస్తారు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు.బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి, ఎందుకంటే వల్ల అవినీతి సొమ్మును బయటికి తీసి, ప్రజలకు పంచుతమని అన్నారు.
సోనీయామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు. మహాత్మా గాంధీ నుండి ఇప్పటి వరకు మేము ప్రజల కోసం కొట్లడతున్నము. ప్రజల సంపద ప్రజలకే చెందలని కాంగ్రెస్ చూస్తుంది.కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే 6 గ్యారంటీ లు అమలు చేస్తాం.ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, 5 ఎండ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదిక పైన ఎం చేశామో గర్వంగా మాట్లాడుతాను.తెలంగాణ కోసం కొట్లదింది మీరు, రాష్ట్రం మీది, మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.ఈ కార్యక్రమంలో.. అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి,అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…