Sunday, September 8, 2024

ఘనంగా వాల్మీకి జయంతి

- Advertisement -

భగత్ స్వరూపుడు వాల్మీకి
బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
శిరోధార్యం వాల్మీకి సందేశం,
రత్నాకరుడే వాల్మీకి మహర్షి
ప్రజావాగ్గేయకారుడు, రాజారాంప్రకాష్

నాగర్ కర్నూల్: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వాల్మీకి మహర్షి జయంతి ని తెలంగాణ ఐక్య వాల్మీకి సంఘంఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు.
సభకు తెలంగాణ ఐక్య వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్  మండ్ల దేవన్న నాయుడు అధ్యక్షత వహించారు.
ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్  మాట్లాడుతూ.భారతీయుల నిత్యపారాయణ గ్రంథం రచయిత వాల్మీకి పూర్వనామం రత్నాకరుడు ఆయన అట్టడుగు బోయ కులానికి చెందినవాడు దారి దోపిడీలు దొంగతనాలు హత్యలు చేసి కుటుంబ పోషణ జరుపుకునే వాడు ఏమాత్రందయ ప్రేమ కరుణ లేని జీవితం గడిపాడు నారదుడి మంత్రోపదేశం తో రత్నాకర బోయి ఘోర తపస్సు చేయడం వలన అతనిపై పుట్ట పెరిగినది ఆ పుట్టలో నుంచి మళ్లీ బయటికి వచ్చిన వాడు కావున  రత్నాకర్ బోయి వాల్మీకి గా మారి వేలవేల శ్లోకాలను ఏకరువు పెట్టి రసరమ్యమైన రామాయణ ప్రచురించడానికి కారణం అయినాడు  రామాయణ గ్రంథాన్ని 7 ఖండలుగా ,24,000 శ్లోకాలతో కుటుంబ గాధగా పితృవాక్య పరిపాలన సర్వ సోదర ప్రేమ ఏకపత్నీ వ్రతం శత్రువుకైనా ప్రేమించడం ఒకే మాట ఒకే బాట దుష్ట శిక్షణ శిక్షణ రక్షణ అని సందేశంతో రామాయణ కావ్యాన్ని రచించిన మహోన్నత వ్యక్తి వాల్మికి. దాదాపు ప్రపంచ భాషలన్నింటిలోనూ వాల్మీకి రామాయణం తర్జుమా అయింది తెలుగులో శతాబ్దాల నుంచి ఆయా కవులు శ్రీరామ మాధుర్యాన్ని ఆదర్శాలను తమ తమ రచనలను విశేషంగా చాటారు రామాయణ కథలు సమాజంలో ఎవరు ఎలా మెలగాలో బోధించాడు సత్యం ధర్మం లోకానికి రెండు కళ్ళు వాటిని పరిత్యజిస్తే  లోకం మనుగడ సాగించలేదు అధర్మం నుంచి ధర్మం అసత్యం నుండి సత్యం వైపు నడిపించాలన్నదే వాళ్ళకి ఆశయం ఆదర్శం అందుకే రాముని కథానాయకుడిగా నిలబెట్టాడు వివాహ బంధం పాతివ్రత్యం కుటుంబ పాలన విధానం రాజు అనుసరించాల్సిన విధానాలను ఈ ప్రపంచ కుటుంబ బాంధవ్యాలకు మార్గం చూపించిన మహర్షి వాల్మీకి అన్నారు.
భారతదేశంలో వాల్మీకి బోయలు ఒక రాష్ట్రంలో ఎస్సీలు గానూ ఒక రాష్ట్రంలో బీసీలు గాను మరో రాష్ట్రంలో ఎస్టీలు గాను వివిధ రాష్ట్రాలలో వివిధ గ్రూపులుగా బోయ వాల్మీకులను విడిపోయి ఉన్నారు .
మన తెలంగాణ రాష్ట్రంలో బోయలు బీసీలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ఏరియా లో ఎస్ టి గా ఉన్నారు  కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాల్మీకి బోయలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చ వలసినదిగా ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కవి పండితుడు బూరోజు గిరిరాజా చారి,చుక్క రాజు మాజీ కౌన్సిలర్
గంధం నాగరాజు    ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీసభ్యుడు,బాలేమియా ముస్లిం మైనార్టీ సంఘం జిల్లా నాయకుడు,కావలిబాలస్వామి నాయుడు,బోయ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు,రఘు నాయుడు. వాల్మీకి సంఘం నాయకుడు,రాజు వాల్మీకి సంఘం నాయకుడు,రవి యాదవ్ శాకాపూర్ సర్పంచ్  విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్