హైదరాబాద్ డిసెంబర్ 6: రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూరు మండలం, పెంజర్ల జర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి భీమిరెడ్డి తనకు బాల్య స్నేహితుడు మరియు బాలమిత్రుడైన తెలంగాణ రాష్ట్ర రెండవ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనుముల రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా ప్రకటించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కష్టించి పనిచేస్తూ మొదట మల్కాజిగిరి ఎంపీగా తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రెండవ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనుముల రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సుడిగాలి పర్యటన చేసి రాష్ట్రమంతా ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెసును విజయపథంలో నడిపించిన రేవంత్ రెడ్డి వెంట బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేయాలని మరొకసారి రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.


