Wednesday, June 18, 2025

అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణ :మంత్రి సీతక్క హె చ్చరిక

- Advertisement -

అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణ
అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన
స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హె చ్చరిక
హైదరాబాద్ జూన్ 6

Harassment of girls will result in expulsion from the community: Minister Seethakka Hecharika

బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చే స్తామని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీ లు పనిచేస్తాయని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన మేధోమథన సదస్సు ముగింపు సభలో గురువారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమం కో సం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా బా లికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామన్నారు.ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు ర క్షణ కరువు అవుతుందన్నారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీముల ను ఏర్పాటు చేస్తామన్నారు.అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని, అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హె చ్చరించారు. అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళా భద్రత కోసం పటిష్టమైన విధానాలను రూపొందిస్తామన్నారు. చాలా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. పుట్టిన బిడ్డలను పారేయకుండా ఏర్పాటు చేసిన ఊ యలలో వదిలేస్తే వారి బాధ్యతను మేమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏ ర్పాటై పదేళ్లైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్‌ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరమని, త్వరలో రూల్స్‌ను అడాప్ట్ చేసుకుంటామని సీతక్క తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్