Tuesday, December 24, 2024

శిశువుకు శ్రీజ అని పేరు పెట్టిన  హరీష్  రావు

- Advertisement -

మెదక్, సెప్టెంబర్ 30:   శ్రీజ మోములో నూరేళ్లు చిరునవ్వు వెళ్లి విరియాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన శిశుగృహాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శిశుగృహలో మానవీయ కోణం ఆవిష్కృతమైందన్నారు. శిశు గృహలో అనాధ శిశువులను హరీష్ రావు పరిశీలించారు. ఈ క్రమంలో 3 నెలల చిన్నారి చిరునవ్వులు చిందిస్తూ అమాయకంగా శిశుగృహ ఆయాల చేతిలో ఆడుకుంటూ కనబడింది. అక్కడకు వెళ్లిన మంత్రి స్వయంగా తన చేతిల్లో తీసుకుని ముద్దులోలుకుతున్న ఆ చిన్నారికి శ్రీజ అని పేరు పెట్టారు. శ్రీజ ముఖంలో ఎప్పటికి చిరునవ్వులు తొలగని విధంగా తల్లిదండ్రులు లేని లోటు కనబడకుండా పెంచాలని అన్నారు. శ్రీజ ఆనందంగా పెరిగి పెద్దదై నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించేలా శిశు గృహ అధికారులు ఉన్నంతంగా తీర్చిదిద్దాలని ఆశీర్వదించారు.తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు నోచుకోని ఇలాంటి అనాధ పిల్లల సేవచేయడం ప్రజా ప్రతినిధులుగా మాకు చాలా సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అనాధ శిశువులందరినీ శిశు గృహ అధికారులు సొంత బిడ్డల లాగా చూసుకోవాలని మంత్రి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల శ్రీజను విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుండి చిన్నారిని తీసుకొని లీగల్ గా శిశు గృహలో చేర్పించి అలనా పాలన చూస్తున్న వీరందరి అభినందించారు. చిన్నారులను కంటిరెప్పలా కాపాడాలని సూచించారు. శ్రీజ చిరునవ్వు ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట నంగునూరు మండలం ముండ్రాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో బ్యాంకు సేవలు ఉంటాయని తెలిపారు. అందరికీ సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

harish-rao-named-the-baby-sreeja
harish-rao-named-the-baby-sreeja

చంద్రబాబు అరెస్ట్  మంచిది కాదు

మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. పాపం ఈ వయసులో ఆయన్ను అరెస్ట్ మంచిది కాదని తెలిపారు. గతంలో అయిన ఐటీ ఐటీ అన్నాడు కానీ ఇప్పుడు చాలా మంచి మాట చెప్పాడని అన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు తీసుకోవచ్చని చెప్పారని మంత్రి తెలిపారు. కేసీఆర్ పాలన బాగుంది కాబట్టే చంద్రబాబు అలా అన్నారని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం పూర్తి అయ్యేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మగౌరవం, ఆదాయం పెంచిన నాయకుడు అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్