- Advertisement -
రాంచంద్రారెడ్డి కి నివాళులర్పించిన హరీష్ రావు
Harish Rao paid tribute to Ramchandra Reddy
సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రం లో దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి మృత దేహానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. – ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ రాంచంద్రా రెడ్డి తెలంగాణ తొలి సీఎం కెసిఆర్ కి ఎంతో ఆత్మీయులు. నిత్యం ప్రజా సేవా, అభివృద్ధి పైనే తపన పడ్డారు. రాంచంద్రారెడ్డి కోరిక మేరకు కెసిఆర్ గారు గత ప్రభుత్వం లో 10కోట్లు గ్రామ అభివృద్ధి కి నిధులు మంజూరు చేశారు. కెసిఆర్ రాంచంద్రారెడ్డి ఆసుపత్రి వైద్య ఖర్చు లకు గత ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయన్ని అందించారు, అదేవిదంగా ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసి గౌరవించుకున్నాం.టీడీపీ పార్టీ లో ఎమ్మెల్యే గా ఉన్నారని, ప్రజా సేవకు పాటుపడ్డారన్నారు. వారి మృతి బాధాకరం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.
- Advertisement -