Monday, March 24, 2025

 బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసుకుందా

- Advertisement -

 బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసుకుందా
రాజమండ్రి,  మార్చి 11, (వాయిస్ టుడే )

Has the BJP fixed its target?

బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి ఎమ్మెల్సి సీటు దక్కింది. ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మూడు టిడిపి, ఒకటి జనసేన తీసుకోగా పట్టుబట్టి మరి బిజెపి మరొకటి తీసుకుంది. ఇంతవరకు బానే ఉంది కానీ  ఆ ఒక్క సీటు ని బిజెపి హోమ్ వీర్రాజు కు కట్ట బెట్టడం పై టిడిపి శ్రేణుల నుండి విమర్శలు ఎక్కువవుతున్నాయి.  సోము వీర్రాజు బిజెపికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. పార్టీకి పూర్తిగా అంకితమైపోయిన  నాయకుడు. అంతవరకు ఓకే కానీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సానుభూతిపరుడుగా టిడిపి శ్రేణులు భావిస్తుంటాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పై ఆయన చేసిన విమర్శలే కారణం. బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన ఉన్న సమయంలో  టిడిపి అంటే మండిపడుతుండేవారు. ఆయన అధికంగా చేసిన విమర్శలు తెలుగుదేశం పైనే. దానితో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాన్ని  ఆయనకు ఎలా కేటాయిస్తారు అంటూ క్షేత్రస్థాయి టిడిపి కార్యకర్తలు నుండి  అసహనం వ్యక్తం అవుతోంది. నిజానికి ఈ సీటును బిజెపికి చెందిన ఉత్తరాంధ్ర నాయకుడు  మాధవ్ కి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ సడన్ గా సోము వీర్రాజు పేరు ఖరారైంది. ప్రస్తుతానికి శాసనమండలిలో  వైసిపిదే బలం. అక్కడ తమ వాయిస్ బలంగా వినిపించడానికి  కూటమి నాయకులు వైసిపి పాలన లో జరిగిన తప్పులను  ఎండగట్టే నాయకులకే ఎమ్మెల్సీ సీట్లు కట్టబెడుతోంది. టిడిపి నుంచి గ్రీష్మ, జనసేన నుండి నాగబాబు ఆకోవకు చెందినవారే. బిజెపి నుండి మాత్రం గతంలో టిడిపి పై విమర్శలు చేసిన సోమ వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు ఇస్తే ఆ స్థాయిలో వైసీపీపై విరుచుకుపడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. సోము వీర్రాజు మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు. ఆయన గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన వెంటనే హైదరాబాద్ వెళ్లి మరీ మెగా ఫ్యామిలీని కలిసి వచ్చారు. ప్రస్తుతం సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ సీటు దక్కడం వెనక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పని చేసింది అంటున్నారు. ఏపీలో ఎలాగైనా బలపడే ప్రయత్నాలు చేస్తున్న  బిజెపి  తగ్గట్టుగానే వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే తమకు అత్యంత నమ్మకంగా ఉండే సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ సేటు కేటాయించేలా చేసింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న బిజెపి నాయకుల్లో అంతో ఇంతో మాస్ ఇమేజ్ ఉన్నది సోము వీర్రాజు కు మాత్రమే. ఆయనకు ఎమ్మెల్సీ కేటాయించడం ద్వారా కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపినట్టు ఉంటుందని మరింతమంది బిజెపి వైపు తిరిగే ఛాన్స్ ఉంటుందనేది వారి ఆలోచన. మాధవ్ తో పోలిస్తే సోము వీర్రాజు కాస్త దూకుడుగా ఉండే వ్యక్తి. ఇది పార్టీని మాస్ లోకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందని పార్టీ అధిష్టానం భావిస్తుంది. 2027లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో  మాధవ్ కి సీటు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు దగ్గరలో  ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా  న్యాయం చేశామనే మెసేజ్ పంపే ఆలోచన బిజెపి హై కమాండ్ చేస్తోంది. అయితే కూటమిలో చేరింది అన్న ఒకే ఒక కారణంతో  రాష్ట్రంలో ఖాళీ అయ్యే ప్రతి పదవి లోనూ బిజెపి వాటాకు రావడం పై అసహనం వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. ఇప్పటికే ఒక రాజ్యసభను ఆర్ కృష్ణయ్య కోసం తీసుకుపోయారు. విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని  కూడా బిజెపి అడుగుతోంది. అది కాకుండా ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఒకటి బీజేపీ పట్టుకుపోవడం అది కూడా  చంద్రబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు కు కేటాయించడం పై టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్