ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్

- Advertisement -

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్

Having two daughters and a son filled me with immense gratitude: Ram Charan

రామ్ చరణ్, ఉపాసన నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో కవలలు- ఒక పాప, ఒక బాబుకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అయ్యింది. కొణిదెల, కామినేని కుటుంబాల్లో సంబరాలు మొదలయ్యాయి.
రామ్ చరణ్ ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. “మాకు ఒక బాబు, ఒక పాప జన్మించారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది. మా జీవితాల్లో మహిళలే మా గొప్ప బలం. ప్రతి క్షణం మా వెంట నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” తెలియజేశారు.
డెలివరీకి ముందు తీసుకున్న ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది. ఆల్-బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో చరణ్, ఉపాసన ప్రశాంతంగా ఆనందాన్ని వెదజల్లుతూ కనిపించారు. ఫ్లోయింగ్ గౌన్‌లో ఉపాసన మెరవగా, చరణ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
ఆ ఫోటోకు పర్శనల్ టచ్ ని జోడిస్తూ వారి బ్లాక్ డాగ్స్ ఇరువైపులా కూర్చొని, కుటుంబంలో ఉన్న స్నేహం, ఐక్యత, ఎదురుచూపులను అందంగా ప్రతిఫలించాయి.
కవలల రాకతో మెగా కుటుంబంలో సంబరాలు డబుల్ అయ్యాయి. ఇది రామ్ చరణ్–ఉపాసన జీవితాల్లో ఒక మధురమైన కొత్త అధ్యాయానికి ఆరంభం. అభిమానులు,  శ్రేయోభిలాషులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular