హైదరాబాద్, అక్టోబరు 25, (వాయిస్ టుడే): బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బీఆర్‌ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదని.. కాంగ్రెస్ అంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రటకనలో తెలిపారు. అయితే. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక, ఇతర నాయకుల చేరికపై ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీలోకి ఎవరువచ్చినా స్వాగతిస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై.. కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయం అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, రాజగోపాల్ రెడ్డి చేరిక విషయంపై తనతో ఎటువంటి చర్చ జరపలేదని.. కాంగ్రెస్ లోకి ఎవరొచ్చిన స్వాగతిస్తామని.. అయితే, ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అంటూ వివరించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంచరీ కొట్టబోతోందని భువనగరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ సునామీ నడుస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ 100కు పైగా సీట్లు గెలుస్తుందని.. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు డబ్బు అవసరం లేదంటూ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాయన్నారు. 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ సునామీ ఎవ్వరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కార్యకర్తలే నా బలం అభిమానులే నా ఊపిరి వారి ఆకాంక్షలే నా ఆశయం పదవులు నాకేం కొత్త కాదు. ప్రజల కోసమే నా నిర్ణయం. నా కార్యకర్తలు, అభిమానులందరి అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నా నిర్ణయానికి అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ.. మీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి