తిరుపతి ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన

- Advertisement -

తిరుపతి ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన

He visited the families of those who died in the Tirupati incident

అనిత

బాధిత కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేసియా

తిరుపతి,

వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్‌ ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి  25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుం టామని, ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి అనిత,తో పాటు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జాయింట్‌ కలెక్టర్‌తో కలసి రుయా ఆసుపత్రి మార్చురిలో ఉన్న మృతులను పరిశీలించారు.
మృతుల కుటుంబాలను ఓదార్చి వారి వివరాలు తెలుసుకున్నా ఏపీ హోంశాఖ మంత్రి అనిత.
అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకన్‌ ఇచ్చే ప్రదేశం వద్ద తొక్కిస లాటలో మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, రాష్ట్ర హోం మంత్రి అనిత  తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమేరాలు ఉన్నా యని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మృతి చెందిన వారి కుటుం బానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుం దన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకుంటా మన్నారు.
మృతులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృత దేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామా లకు చేర్చడం జరుగు తుందని వెల్లడించారు.
ఈ ఘటనకు కారణాలు తొందరపాటు చర్యా? లేక సమన్వయ లోపమా? అనేది విచాణలో తేలుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular