గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

- Advertisement -

గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

కొమురం భీం జిల్లా: డిసెంబర్ 24

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం లోని ఈస్ గాం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జి, దయానంద్(55) విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు.

డ్యూటీ నిర్వహణలో భాగంగా రాత్రి నజురుల్ నగర్ మార్కెట్ కు వెళ్లగా అక్కడే గుండెపోటు వచ్చి కిందపడి పోయాడు. మార్కెట్లోని పలువురు ఈస్ గాం స్టేషన్లు సమాచారం అందించారు.

సహచరులు పోలీసులు తమ వాహనంలో అతడిని తీసుకుని కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ఆయనకు చికిత్స అందించే ప్రయత్నంలో హెడ్ కానిస్టేబుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular