Thursday, January 15, 2026

కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల గుండెపోటు

- Advertisement -

కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల గుండెపోటు
ముంబై, జూలై 2

Heart attack caused by Covid-19 vaccine

కొన్నేళ్లుగా దేశంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు సంబంధించి ఉన్న భయాలకు సమాధానం దొరికింది. భారతదేశంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ICMR, AIIMS లు చేసిన కొత్త అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చారు. నివేదిక ప్రకారం, గత నాలుగైదు ఏళ్లుగా ఆకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు కారణం కోవిడ్19 వ్యాక్సిన్ కాదు. కానీ ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు, వ్యాధులు, చెడు జీవనశైలి, వంశపారంపర్యంగా తలెత్తిన అనారోగ్య కారణాలు వల్ల మరణాలు సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్, ఏయిమ్స్ అధ్యయనంలో తేలింది. ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలు, షుగర్ లేదా అధిక రక్తపోటు వంటివి ఉంటే, జన్యుపరంగా సమస్యలు ఉన్నా.. వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కనుక దేశంలో ఇటీవల పెద్దలతో పాటు యువతలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కోవిడ్19  వ్యాక్సిన్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా అధ్యయనం ప్రకారం కోవిడ్19 వ్యాక్సిన్ సురక్షితమైనదని. కనుక కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని సూచించారు. అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్‌కు, అకస్మాత్తుగా సంభవించే మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు, ఇప్పటికే ఉన్న వ్యాధులు, వంశపారంపర్య కారణాలు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. అదే సమయంలో కోవిడ్19 వ్యాక్సిన్ల వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావం చూపడం చాలా అరుదు. ముఖ్యంగా 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో గుండెపోటుతో అకస్మాత్తుగా సంభవించిన మరణాలను పరిశోధించడానికి రెండు ముఖ్యమైన అధ్యయనాలు నిర్వహించారు.ఈ శాస్త్రీయ అధ్యయనాలలో యువత, మధ్య వయస్కులోనూ అకస్మాత్తుగా సంభవిస్తున్న మరణాలకు కోవిడ్ టీకాలు తీసుకోవడం కారణం కాదని తేలింది. గుండెపోటుతో పాటు చెడు జీవనశైలి, ఇప్పటికే ఉన్న వ్యాధులు, మనకు తెలియకుండా పెరిగిన అనారోగ్య సమస్యలు, వంశపారంపర్య సమస్యలు కారణాలు కారణమని పేర్కొన్నాయి. మే నుంచి ఆగస్టు 2023 మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లోని 47 పెద్ద ఆసుపత్రులలో ICMR ఈ అధ్యయనం నిర్వహించింది. అక్టోబర్ 2021 నుండి మార్చి 2023 మధ్య పూర్తిగా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తులు అకస్మాత్తుగా మరణించిన కేసులను నిపుణులు పరిశీలించారు. ఈ మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని నివేదిక స్పష్టం చేసింది.AIIMS ఢిల్లీ, ICMR ల రెండో రీసెర్చ్ ఇంకా కొనసాగుతోంది.  అకస్మాత్తుగా సంభవించే మరణాలకు గల కారణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడం ఈ అధ్యయనం ముఖ్య లక్ష్యం. ప్రారంభ ఫలితాలలో గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) సర్వసాధారణ కారణమని తేలింది. ఈ మరణాలకు వంశపారంపర్య కారణాలు సైతం కారణమని చాలా సందర్భాల్లో గుర్తించారు. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం, గత కొన్నేళ్లతో పోల్చితే అకస్మాత్తుగా సంభవించే మరణాల సంఖ్యలో ఎటువంటి అసాధారణ పెరుగుదల కనిపించలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్